BWF World Tour Finals: సాత్విక్ జోడీ బోణీ
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:11 AM
సీజన్ ముగింపు టోర్నీ, ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి డబుల్స్‌లో శుభారంభం చేశారు. బుధవారం...
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్
హాంగ్జౌ: సీజన్ ముగింపు టోర్నీ, ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి డబుల్స్‌లో శుభారంభం చేశారు. బుధవారం మొదలైన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ గ్రూప్-బి తొలి పోరులో ఏస్ జోడీ, ప్రపంచ మూడో ర్యాంకర్ సాత్విక్/చిరాగ్ ద్వయం 12-21, 22-20, 21-14తో ఒలింపిక్ రజత పతక విజేత, చైనా జంట లియాంగ్ వీ కెంగ్/వాంగ్ చాంగ్‌ను చిత్తుచేసింది. సరిగ్గా గంటపాటు జరిగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్ కోల్పోయిన సాత్విక్ జంట.. అనంతరం పుంజుకొని వరుస రెండుగేముల్లో సత్తాచాటి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. తమ గ్రూప్‌లో భాగంగా గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా జంట ఫజర్ అల్ఫియాన్/మహ్మద్ షోహిబుల్ ఫిక్రితో సాత్విక్ ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం