Share News

Macau Open: ప్రీక్వార్టర్స్‌కు సాత్విక్‌ ద్వయం

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:34 AM

సాత్విక్‌-చిరాగ్‌ జోడీ మకావు ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. గాయత్రి జంటకు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. పురుషుల డబుల్స్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో...

Macau Open: ప్రీక్వార్టర్స్‌కు సాత్విక్‌ ద్వయం

మకావు ఓపెన్‌

మకావు: సాత్విక్‌-చిరాగ్‌ జోడీ మకావు ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. గాయత్రి జంటకు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. పురుషుల డబుల్స్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట 21-13, 21-15తో మలేసియాకు చెందిన లో హాంగ్‌ యి-ఎన్‌జి ఇంగ్‌ చియాంగ్‌పై సునాయాసంగా గెలిచింది. కాగా, మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జంట 21-16, 20-22, 15-21తో చైనీస్‌ తైపీకి చెందిన లింగ్‌ గ్జియో మిన్‌-పెంగ్‌ యు వి చేతిలో ఓడింది..

టాప్‌-10లోకి సాత్విక్‌ జోడీ..: బీడబ్ల్యూఎఫ్‌ పురుషుల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌ జోడీ మళ్లీ టాప్‌-10లోకి దూసుకొచ్చింది. తాజా ర్యాంక్‌ల జాబితాలో సాత్విక్‌-చిరాగ్‌ జంట మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 9వ ర్యాంక్‌లో నిలిచింది. సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ రెండు ర్యాంక్‌లు మెరుగుపర్చుకొని 17వ స్థానంలో, ప్రణయ్‌ 33వ ర్యాంక్‌లో ఉన్నారు. పీవీ సింధు 15వ ర్యాంక్‌లో నిలకడగా కొనసాగుతుండగా.. 17 ఏళ్ల ఉన్నతి హుడా కెరీర్‌ బెస్ట్‌ 31వ ర్యాంక్‌ సాధించింది.

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 05:34 AM