Share News

బరిలో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - May 27 , 2025 | 02:23 AM

ఫిట్‌నెస్‌ సమస్యలతో కొన్ని టోర్నీలకు దూరమైన భారత డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి.. సింగపూర్‌ ఓపెన్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి జరిగే టోర్నీలో...

బరిలో సాత్విక్‌ జోడీ

నేటి నుంచి సింగపూర్‌ ఓపెన్‌

సింగపూర్‌: ఫిట్‌నెస్‌ సమస్యలతో కొన్ని టోర్నీలకు దూరమైన భారత డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి.. సింగపూర్‌ ఓపెన్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి జరిగే టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన చూంగ్‌ హాన్‌ జియాన్‌-హైకల్‌ జంటతో సాత్విక్‌ జోడీ తలపడనుంది. కిడాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నా.. ప్రణయ్‌, లక్ష్య సేన్‌, ప్రియాన్షు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, మాళవిక బన్సోడ్‌, పీవీ సింధు, ఉన్నతి హుడా, అనుపమ బరిలోకి దిగనున్నారు. డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌, కవిప్రియ-సిమ్రన్‌, అమృత-సోనాలి, మిక్స్‌డ్‌లో రుత్విక శివాని-రోహన్‌, తనీషా క్రాస్టో-ధ్రువ్‌ కపిల జంటలు ఆడనున్నాయి.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:23 AM