Share News

Australian Open Badminton: క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Nov 21 , 2025 | 02:25 AM

టాప్‌ సీడ్‌ సాత్విక్‌/చిరాగ్‌ జోడీ, సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, ఆయుష్‌ షెట్టి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. అయితే ప్రణయ్‌, తరుణ్‌, కిడాంబి శ్రీకాంత్‌...

Australian Open Badminton: క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

  • ప్రణయ్‌, తరుణ్‌, శ్రీకాంత్‌ ఓటమి

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

సిడ్నీ : టాప్‌ సీడ్‌ సాత్విక్‌/చిరాగ్‌ జోడీ, సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, ఆయుష్‌ షెట్టి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. అయితే ప్రణయ్‌, తరుణ్‌, కిడాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు. గురువారం జరిగిన డబుల్స్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి 21-18, 21-11తో తైపీ జంట సు చింగ్‌ హెంగ్‌/వు గువాన్‌ జున్‌పై నెగ్గారు. ఆయుష్‌ షెట్టి 21-17, 21-16తో నాలుగో సీడ్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)కు షాకిచ్చాడు. లక్ష్యసేన్‌ 21-17, 13-21, 21-13తో చి యు జెన్‌ (తైపీ)పై పోరాడి నెగ్గాడు. క్వార్టర్‌ఫైనల్లో ఆయు్‌ష-లక్ష్యసేన్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇక ప్రణయ్‌-ఫర్హాన్‌ అల్వీ (ఇండోనేసియా) చేతిలో, శ్రీకాంత్‌ 20-22, 16-21తో షోగో ఒగావా (జపాన్‌) చేతిలో, తరుణ్‌ మన్నేపల్లి 13-21, 21-19, 10-21తో లిన్‌ (తైపీ) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి తిరుగుముఖం పట్టారు.

ఇవి కూడా చదవండి:

గంభీర్‌పై మాజీ ప్లేయర్ ఆగ్రహం

చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 02:25 AM