డబుల్స్‌లో ముందంజ
ABN , Publish Date - May 29 , 2025 | 03:29 AM
భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ ఆరంభ రౌండ్లో సాత్విక్ జంట 21-16, 21-13తో మలేసియా జోడీ...
సింగపూర్ ఓపెన్
సాత్విక్, గాయత్రి, రుత్విక జోడీలు శుభారంభం
సింగపూర్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ ఆరంభ రౌండ్లో సాత్విక్ జంట 21-16, 21-13తో మలేసియా జోడీ చూంగ్ హాన్/మహ్మద్ హైకల్‌ను ఓడించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా జాలీ ద్వయం 21-14, 19-21, 21-17తో తైపీ జంట చాంగ్ చింగ్/యాంగ్ చింగ్‌పై నెగ్గి రెండోరౌండ్ చేరగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో రుత్వికా శివాని/రోహన్ ద్వయం 21-16, 21-19తో అమెరికా జంట చెన్/కార్బెట్‌ను చిత్తుచేసి రెండోరౌండ్లో ప్రవేశించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత నెంబర్‌వన్ షట్లర్ లక్ష్య సేన్ వెన్నునొప్పి కారణంగా ఆరంభ రౌండ్ మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు. తైపీ షట్లర్ లిన్ చున్ యితో పోరులో లక్ష్య 21-15, 17-21, 5-13తో ఉన్నప్పుడు మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అనుపమ, ఉన్నతి ప్రత్యర్థుల చేతిలో ఓడి ఆదిలోనే ఇంటిబాట పట్టారు.
ఇవీ చదవండి:
హీరోలను మించిన లుక్‌లో రాహుల్!
కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి