సాత్విక్ జోడీ శుభారంభం
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:41 AM
సొంతగడ్డపై ఇండియా ఓపెన్‌లో నిరాశపరిచిన భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి ఇండోనేసియా మాస్టర్స్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో...
‘ఇండోనేసియా మాస్టర్స్’లో శ్రీకాంత్‌కు నిరాశ
జకార్త: సొంతగడ్డపై ఇండియా ఓపెన్‌లో నిరాశపరిచిన భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి ఇండోనేసియా మాస్టర్స్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్/చిరాగ్ జంట 21-16, 21-15తో చైనీస్ తైపీ జోడీ చెన్ జి/లిన్ యుపై గెలిచి రెండోరౌండ్ చేరింది. మహిళల డబుల్స్‌లో భారత ద్వయం అశ్వినీ పొన్నప్ప/తనీషా క్యాస్ట్రో 21-6, 21-14తో థాయ్‌లాండ్ జోడీ ఒర్నిచా/సుకితాపై నెగ్గి రెండో రౌండ్లో ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నెంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగాడు. భారత్‌కే చెందిన ఆయుష్ శెట్టి 21-7, 21-15తో శ్రీకాంత్‌ను చిత్తుచేసి మెయిన్‌డ్రాకు చేరాడు. మహిళల సింగిల్స్‌లో తాన్యా హేమంత్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే