Share News

India vs South Africa 2nd ODI: గైక్వాడ్, కోహ్లీ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా టీమిండియా..

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:22 PM

కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

India vs South Africa 2nd ODI: గైక్వాడ్, కోహ్లీ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా టీమిండియా..
Ruturaj Gaikwad, Virat Kohli

కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించారు (Virat Kohli century).


రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించి ఈ రోజు మరో సెంచరీ చేశాడు. 90 బంతుల్లో శతకం బాదాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో హోరెత్తించాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది 53వ వన్డే సెంచరీ. మరో ఎండ్‌లో గైక్వాడ్ (105) కూడా అద్భుత శతకం సాధించాడు. గైక్వాడ్ 77 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 2 సిక్స్‌లు, 12 ఫోర్లు కొట్టాడు. కెరీర్‌లో తొలి సెంచరీ చేశాడు (Ruturaj Gaikwad century). అనంతరం యన్‌సెన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.


కోహ్లీ, గైక్వాడ్ మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు (Gaikwad Kohli partnership). ప్రస్తుతం టీమిండియా 38 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. కోహ్లీతో పాటు కెప్టెన్ రాహుల్ క్రీజులో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రోజు మ్యాచ్‌‌లో కూడా గెలిస్తే ఈ సిరీస్‌ను టీమిండియా దక్కించుకుంటుంది.


ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 03 , 2025 | 05:35 PM