Rohit-Kohli: రోహిత్, విరాట్ కోహ్లీకి ఆ గౌరవం దక్కి ఉండాల్సింది.. బీసీసీఐకి అనిల్ కుంబ్లే సూచన
ABN , Publish Date - May 13 , 2025 | 09:09 PM
దాదాపు దశాబ్దంన్నర కాలంగా రోహిత్, కోహ్లీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. వీరిద్దరూ అనూహ్యంగా ఒకేసారి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 7వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ మే 12న వీడ్కోలు పలికాడు. దీంతో క్రీడా లోకం విస్మయానికి గురైంది.
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)కు గౌరవనీయ వీడ్కోలు దక్కాల్సిందని మాజీ దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే (Anil Kumble) అభిప్రాయపడ్డాడు. దాదాపు దశాబ్దంన్నర కాలంగా రోహిత్, కోహ్లీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. వీరిద్దరూ అనూహ్యంగా ఒకేసారి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 7వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ మే 12న వీడ్కోలు పలికాడు. దీంతో క్రీడా లోకం విస్మయానికి గురైంది. మాజీ క్రికెటర్లు కూడా వీరి రిటైర్మెంట్ గురించి తమ స్పందనలను తెలియజేశారు (Virat Kohli Retirement).
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే వీరిద్దరి రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ``ఇది నిజంగా షాకింగ్ వీడ్కోలు. మైదానంలో ప్రేక్షకుల మధ్య రోహిత్, కోహ్లీ వీడ్కోలు ఉంటే బాగుండేది. గతంలో అశ్విన్ కూడా ఇలా నిశబ్దంగానే టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఈ ముగ్గురు దిగ్గజాలను బీసీసీఐ తగిన రీతిలో గౌరవించాలి. ఘనంగా వీడ్కోలు పలకాలి`` అని అనిల్ కుంబ్లే సూచించాడు. ముఖ్యంగా కోహ్లీ రిటైర్మెంట్ తనను షాక్ గురించి చేసిందని కుంబ్లే చెప్పాడు.
కోహ్లీకి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, త్వరలో జరగబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని తాను భావించానని కుంబ్లే చెప్పాడు. ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్ చాలా కఠినంగా ఉంటుందని, కోహ్లీ, రోహిత్ లాంటి అనుభవజ్ఞులు లేకుండా అక్కడకు వెళ్లడం సవాలేనని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీ నిర్ణయాలతో సెలెక్టర్లు కూడా ఆశ్చర్యానికి గురై ఉంటారని కుంబ్లే పేర్కొన్నాడు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..