Share News

Rohan Bopanna Retires from Tennis:

ABN , Publish Date - Nov 02 , 2025 | 03:41 AM

వెటరన్‌ స్టార్‌, గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నలుగురు భారత ఆటగాళ్లలో ఒకడైన రోహన్‌ బోపన్న ప్రొఫెషనల్‌ టెన్ని్‌సకు శనివారం వీడ్కోలు పలికాడు....

Rohan Bopanna Retires from Tennis:

రికార్డుల వీరుడు..

న్యూఢిల్లీ: వెటరన్‌ స్టార్‌, గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నలుగురు భారత ఆటగాళ్లలో ఒకడైన రోహన్‌ బోపన్న ప్రొఫెషనల్‌ టెన్ని్‌సకు శనివారం వీడ్కోలు పలికాడు. దరిమిలా రెండున్నర దశాబ్దాలకుపైగా సాగిన అతడి డబుల్స్‌ కెరీర్‌కు తెరపడింది. 45 ఏళ్ల బోపన్న ఆడిన చివరి టోర్నీ గతవారం జరిగిన పారిస్‌ మాస్టర్స్‌. ఆ టోర్నీలో రోహన్‌ తొలి రౌండ్‌లోనే ఓడాడు. ‘ఆటకు వీడ్కోలు. కానీ ఇదే ముగింపు కాదు’ అని బోపన్న ఉద్వేగభరిత పోస్ట్‌ చేశా డు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌తో భారత్‌కు చివరిసారి ఆడేశాడు. 2023 లో డేవి్‌స కప్‌నకు గుడ్‌బై చెప్పాడు.

కర్ణాటకలోని కూర్గ్‌కు చెందిన బోపన్న డబుల్స్‌ ఆటగాడిగా ప్రసిద్ధుడు. 2000 సంవత్సరంలో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన అతడు పలు డేవిస్‌ కప్‌ పోటీలు, గ్రాండ్‌స్లామ్‌లు, ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. లేటు వయసులో రికార్డు ప్రదర్శనలతో అలరించిన బోపన్న.. 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌, 2024లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిళ్లు సాధించాడు. 2023లో ఇండియన్‌ వెల్స్‌ గెలుపుతో 43 ఏళ్ల వయస్సులో ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా.. గతేడాది డబుల్స్‌లో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌తో ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయసు ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు.

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 03:41 AM