Share News

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భారత్‌ వల్లే

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:39 AM

వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌ను చేర్చడానికి భారతే కారణమని బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌ కొనియాడారు. క్రికెట్‌ వీరాభిమాని అయిన సునాక్‌...

ఒలింపిక్స్‌లో క్రికెట్‌  భారత్‌ వల్లే

బ్రిటన్‌ మాజీ ప్రధాని

రిషి సునాక్‌

అహ్మదాబాద్‌: వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌ను చేర్చడానికి భారతే కారణమని బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌ కొనియాడారు. క్రికెట్‌ వీరాభిమాని అయిన సునాక్‌.. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. భారత్‌ను ప్రభావితమైన శక్తిగా తయారు చేయడంలో ఐపీఎల్‌, బీసీసీఐ పాత్ర ఎంతో ఉందని ఆయన ప్రశంసించారు. 1900 తర్వాత.. లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. ‘21వ శతాబ్దాన్ని భారత్‌ ఎలా ప్రభావితం చేయగలదనడానికి ఇవి సంకేతాలు. వందేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కిందంటే.. అది ఇండియా వల్లేన’ని సునాక్‌ అన్నారు. ఇక, ఐపీఎల్‌లో ‘ఈ సాల కప్‌ నమ్దే’ అంటూ బెంగళూరుకు సునాక్‌ మద్దతు ప్రకటించారు.

ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 04:39 AM