Share News

చెన్నై పోరాడినా..

ABN , Publish Date - May 04 , 2025 | 02:59 AM

ఐపీఎల్‌లో అత్యధిక అభిమానగణం కలిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాక చెన్నై అదిరే ఆటతో ఆకట్టుకున్నా...

చెన్నై పోరాడినా..

నేటి మ్యాచ్‌లు

కోల్‌కతా X రాజస్థాన్‌

వేదిక: కోల్‌కతా, మ.3.30 నుంచి

పంజాబ్‌ X లఖ్‌నవూ

వేదిక: ధర్మశాల, రా.7.30 నుంచి

  • ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయం

  • విరాట్‌, బెథెల్‌, షెఫర్డ్‌ హాఫ్‌సెంచరీలు

  • ఆయుష్‌ మాత్రే సెంచరీ మిస్‌

షెఫర్డ్‌ : (14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 53 నాటౌట్‌)

బెంగళూరు: ఐపీఎల్‌లో అత్యధిక అభిమానగణం కలిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాక చెన్నై అదిరే ఆటతో ఆకట్టుకున్నా.. ఆఖరి బంతికి ఓడాల్సి వచ్చింది. పేసర్‌ యష్‌ దయాళ్‌ ఈ ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో ఆర్‌సీబీ కేవలం 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. అలాగే 16 పాయింట్లతో తిరిగి టాప్‌లోకి చేరి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ దాదాపు ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. విరాట్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 62), బెథెల్‌ (33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55), షెఫర్డ్‌ (14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 53 నాటౌట్‌) చెలరేగారు. పథిరనకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసి ఓడింది. ఆయుష్‌ మాత్రే (48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 94), జడేజా (45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. ఎన్‌గిడికి మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షెఫర్డ్‌ నిలిచాడు.


ఆయుష్‌ అదిరేలా..: భారీ ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్‌ సజావుగానే ఆరంభమైంది. ఓపెనర్‌ ఆయుష్‌ మాత్రే అద్భుత ఆటతీరుతో కదం తొక్కాడు. అతడికి జడేజా మధ్య ఓవర్లలో సహకారం అందించాడు. ఇద్దరూ మూడో వికెట్‌కు 114 పరుగులందించారు. అటు ఆర్‌సీబీ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను వదిలేసినా.. చివరి ఓవర్‌లో చెన్నైకి నిరాశ తప్పలేదు. మరో ఓపెనర్‌ రషీద్‌ (14) విఫలమైనా.. మాత్రే మాత్రం జోరును ఆపలేదు. భువీ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో 4,4,4,6,4,4తో 26 పరుగులు సాధించాడు. అయితే వరుస ఓవర్లలో రషీద్‌, కర్రాన్‌ (5) వికెట్లను కోల్పోవడంతో పవర్‌ప్లేలో 58/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కూడా లయ దెబ్బతినకుండా మాత్రే-జడేజా ఆర్‌సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 25 బంతుల్లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించిన మాత్రే పదో ఓవర్‌లో 6,6,4తో స్కోరును వంద దాటించాడు. 16వ ఓవర్‌లో మాత్రే, జడేజా క్యాచ్‌లను వదిలేశారు. అయితే మాత్రే 94 పరుగుల వద్ద సిక్సర్‌కు వెళ్లి క్రునాల్‌ క్యాచ్‌తో వెనుదిరగ్గా, బ్రెవిస్‌ (0) ఎల్బీ అయ్యాడు. అయితే రీప్లేలో బంతి లెగ్‌ స్టంప్‌ను మిస్‌ అవుతున్నట్టు తేలింది. ఈ ఇద్దరినీ ఎన్‌గిడి అవుట్‌ చేశాడు. ఇక ఆరు బంతుల్లో 15 పరుగులు కావాల్సిన వేళ హైడ్రామా నెలకొంది. పేసర్‌ యష్‌ మూడో బంతికి ధోనీ (12)ని అవుట్‌ చేయగా దూబే (8 నాటౌట్‌) సిక్సర్‌తో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి బంతికి ఫోర్‌ రావాల్సి ఉండగా ఒక్క పరుగే తీసిన చెన్నై ఓడక తప్పలేదు.


ఓపెనర్ల జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్‌, బెథెల్‌ అదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ మైదానం నలువైపులా బౌండరీలు బాదేయడంతో స్కోరు దూసుకెళ్లింది. అయితే వీరున్నంత సేపే జోరు కనిపించగా.. ఆ తర్వాత చెన్నై బౌలర్ల కట్టడితో నెమ్మదించింది. కానీ స్వల్ప స్కోరుకు పరిమితం కావాల్సిన ఆర్‌సీబీని చివర్లో షెఫర్డ్‌ ఆదుకున్నాడు. తొలి ఓవర్‌లోనే బెథెల్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో ధాటిని కనబర్చగా.. పేసర్‌ ఖలీల్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే నాలుగో ఓవర్‌లో బెథెల్‌ క్యాచ్‌ను జడేజా, పథిరన సమయన్వయ లోపంతో వదిలేశారు. అటు విరాట్‌ ఆరో ఓవర్‌లో 6,4తో పవర్‌ప్లేలో జట్టు 71 పరుగులతో నిలిచింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి పేసర్‌ పథిరన షాక్‌ ఇచ్చాడు. పదో ఓవర్‌లో బ్రెవిస్‌ డైవింగ్‌ క్యాచ్‌తో బెథెల్‌ వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లో విరాట్‌ 6,4,4తో 29 బంతుల్లో వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. కానీ ఆ వెంటనే కర్రాన్‌కు చిక్కాడు. అయితే దేవ్‌దత్‌ (17), రజత్‌ (11), జితేశ్‌ (7) ఆకట్టుకోలేదు.

ఆ రెండు ఓవర్లలో..: 18 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు కేవలం 159/5. ఈ దశలో 180 కూడా కష్టమే అనిపించింది. కానీ ఆట 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు 6,6,4,6,6నోబ్‌, 4తో ఏకం గా 33 పరుగులు రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 4,4,6,6తో 21 రన్స్‌ రాగా స్కోరు కూడా 200 దాటేసింది. మరోవైపు 14 బంతుల్లోనే షెఫర్డ్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తయ్యింది.

\


స్కోరుబోర్డు

బెంగళూరు: బెథెల్‌ (సి) బ్రేవిస్‌ (బి) పథిరన 55; విరాట్‌ (సి) ఖలీల్‌ (బి) కర్రాన్‌ 62; పడిక్కళ్‌ (సి) జడేజా (బి) పథిరన 17; రజత్‌ (సి) కర్రాన్‌ (బి) పథిరన 11; జితేశ్‌ (సి) బ్రెవిస్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 7; డేవిడ్‌ (నాటౌట్‌) 2; షెఫర్డ్‌ (నాటౌట్‌) 53; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 213/5. వికెట్ల పతనం: 1-97, 2-121, 3-144, 4-154, 5-157; బౌలింగ్‌: ఖలీల్‌ 3-0-65-0; అన్షుల్‌ 3-0-25-0; నూర్‌ అహ్మద్‌ 4-0-26-1; జడేజా 3-0-26-0; కర్రాన్‌ 3-0-34-1; పథిరన 4-0-36-3.

చెన్నై: ఆయుష్‌ మాత్రే (సి) క్రునాల్‌ (బి) ఎన్‌గిడి 94, రషీద్‌ (సి) షెఫర్డ్‌ (బి) క్రునాల్‌ 14, కర్రాన్‌ (సి) జితేష్‌ (బి) ఎన్‌గిడి 5, జడేజా (నాటౌట్‌) 77, బ్రెవిస్‌ (ఎల్బీ) ఎన్‌గిడి 0, ధోనీ (ఎల్బీ) యశ్‌ 12, దూబే (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం: 20 ఓవర్లలో 211/5, వికెట్లపతనం: 1-51, 2-58, 3-172, 4-172, 5-201; బౌలింగ్‌: క్రునాల్‌ 3-0-24-1, భువనేశ్వర్‌ 4-0-55-0, యశ్‌ దయాల్‌ 4-0-41-1, ఎన్‌గిడి 4-0-30-3, సుయాశ్‌ 4-0-43-0, షెఫర్డ్‌ 1-0-18-0.


1

చివరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు (54) సాధించిన జట్టుగా ఆర్‌సీబీ

2

ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్‌ (14 బంతుల్లో) ఫిఫ్టీ సాధించిన షెఫర్డ్‌. కమిన్స్‌, రాహుల్‌తో సమంగా నిలిచాడు. జైస్వాల్‌ (13) టాప్‌లో ఉన్నాడు.

3

ఐపీఎల్‌లో ఫిఫ్టీ సాధించిన మూడో యంగెస్ట్‌ (17 ఏళ్లు) బ్యాటర్‌గా ఆయుష్‌

1

టీ20ల్లో ఒకే వేదికపై ఎక్కువ సిక్సర్లు (154) బాదిన బ్యాటర్‌గా విరాట్‌. అలాగే సీఎస్‌కేపై ఎక్కువ హాఫ్‌ సెంచరీలు (10) సాధించిన బ్యాటర్‌గానూ నిలిచాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 11 8 3 0 16 0.482

ముంబై 11 7 4 0 14 1.274

గుజరాత్‌ 10 7 3 0 14 0.867

పంజాబ్‌ 10 6 3 1 13 0.199

ఢిల్లీ 10 6 4 0 12 0.362

లఖ్‌నవూ 10 5 5 0 10 -0.325

కోల్‌కతా 10 4 5 1 9 0.271

రాజస్థాన్‌ 11 3 8 0 6 -0.780

హైదరాబాద్‌ 10 3 7 0 6 -1.192

చెన్నై 11 2 9 0 4 -1.117

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 02:59 AM