టాప్ 2 లక్ష్యంగా
ABN , Publish Date - May 27 , 2025 | 02:19 AM
ఐపీఎల్ ప్లేఆ్‌ఫ్సలో చోటే కాకుండా టాప్-2లో నిలవాలని ప్రతీ జట్టు భావిస్తుంటుంది. ఎందుకంటే వీటి మధ్య జరిగే క్వాలిఫయర్1లో గెలిచిన జట్టు నేరుగా...
నేడు లఖ్‌నవూతో ఆర్‌సీబీ పోరు
లఖ్‌నవూ: ఐపీఎల్ ప్లేఆ్‌ఫ్సలో చోటే కాకుండా టాప్-2లో నిలవాలని ప్రతీ జట్టు భావిస్తుంటుంది. ఎందుకంటే వీటి మధ్య జరిగే క్వాలిఫయర్1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లడంతో పాటు ఓడిన టీమ్‌కు మరో చాన్స్ ఉంటుంది. ఇక... ముంబైపై గెలుపుతో 19 పాయింట్లతో పంజాబ్ అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయర్1లో ఆ జట్టుతో పోటీ పడేందుకు ఆర్‌సీబీ ఉవ్విళ్లూరుతోంది. అయితే అంతకంటే ముందు మంగళవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో పటీదార్ సేన కచ్చితంగా గెలవాల్సిందే. లేకపోతే 18 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ రెండో స్థానం దక్కించుకుంటుంది. లఖ్‌నవూ తమ చివరి మ్యాచ్‌లో టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి ఊపు మీదుంది. బెంగళూరు మాత్రం సన్‌రైజర్స్‌పై రెండు విభాగాల్లోనూ నిరాశపరిచింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి