Share News

ఫేవరెట్‌ ముంబై

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:59 AM

రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లకు వేళైంది. మొత్తం..నాలుగు మ్యాచ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం ప్రారంభం కానున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌

ఫేవరెట్‌ ముంబై

హరియాణాతో క్వార్టర్స్‌

నేటినుంచి రంజీట్రోఫీ స్పోర్ట్స్‌ 18లో ఉ.9 నుంచి’

కోల్‌కతా: రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లకు వేళైంది. మొత్తం..నాలుగు మ్యాచ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం ప్రారంభం కానున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై..హరియాణాతో అమీతుమీ తేల్చుకోనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే చేరికతో ముంబై అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. మేఘాలయతో గత మ్యాచ్‌లో సిద్ధేష్‌, ఆకాష్‌, షామ్స్‌ ములానీ సెంచరీలు చేశారు. ఈ నేపథ్యంలో ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న ముంబైని ఎదుర్కోవడం హరియాణాకు సవాలే. ఇక ఇతర మ్యాచ్‌ల్లో..రాజ్‌కోట్‌లో గుజరాత్‌-సౌరాష్ట్ర, నాగ్‌పూర్‌లో విదర్భ-తమిళనాడు, పుణెలో కేరళ-జమ్మూ కశ్మీర్‌ జట్లు తలపడతాయి.

Updated Date - Feb 08 , 2025 | 06:59 AM