Share News

Ranji Trophy 2025: హైదరాబాద్‌ 295 కు 7 వికెట్లు

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:34 AM

రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ ఎలీట్‌ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో రాహుల్‌ రాదేష్‌ (85 బ్యాటింగ్‌), కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (55) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి...

Ranji Trophy 2025: హైదరాబాద్‌ 295 కు 7 వికెట్లు

రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌

హైదరాబాద్‌: రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ ఎలీట్‌ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో రాహుల్‌ రాదేష్‌ (85 బ్యాటింగ్‌), కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (55) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 295/7 స్కోరుతో నిలిచింది. రోహిత్‌ రాయుడు (47), హిమతేజ (39) ఫర్వాలేదనిపించారు. అంకిత్‌, అశోక్‌ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. క్రీజులో రాదే్‌షతో పాటు తనయ్‌ (5) ఉన్నాడు. ఇక, విశాఖపట్నంలో తమిళనాడుతో మొదలైన రంజీ పోరులో మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 20/1 స్కోరు చేసింది. అంతకుముందు ఆంధ్ర బౌలర్లు పృథ్వీరాజ్‌ (4/46), సౌరభ్‌ (2/4) విజృంభించడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

2028 Olympics: భారత్‌, పాక్‌ పోరు లేనట్లేనా..?

ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 05:34 AM