Share News

అభిమానుల జోష్‌పై నీళ్లు

ABN , Publish Date - May 18 , 2025 | 02:45 AM

తొమ్మిది రోజుల విరామం తర్వాత.. అభిమానుల సందడి మధ్య ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌కు వరుణుడు షాకిచ్చాడు. శనివారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య...

అభిమానుల జోష్‌పై నీళ్లు

నేటి మ్యాచ్‌లు

ఢిల్లీ X గుజరాత్‌, మ.3.30 నుంచి

వేదిక: ఢిల్లీ

రాజస్థాన్‌ X పంజాబ్‌, రా.7.30 నుంచి

వేదిక: జైపూర్‌

కోల్‌కతా అవుట్‌

ప్లేఆఫ్స్‌కు మ్యాచ్‌ దూరంలో బెంగళూరు

  • ఐపీఎల్‌ పునఃప్రారంభ మ్యాచ్‌ రద్దు

  • ఏకధాటిగా కురిసిన వర్షం

  • కోహ్లీకి మద్దతుగా తెలుపు జెర్సీల సందడి

బెంగళూరు: తొమ్మిది రోజుల విరామం తర్వాత.. అభిమానుల సందడి మధ్య ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌కు వరుణుడు షాకిచ్చాడు. శనివారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన కీలక మ్యాచ్‌ రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. ఫలితంగా 13 మ్యాచ్‌లాడి 12 పాయింట్లతో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. అటు బెంగళూరు 17 పాయింట్లతో పట్టికలో టాప్‌నకు చేరింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే రజత్‌ పటీదార్‌ సారథ్యంలోని బెంగళూరు నేరుగా ప్లేఆ్‌ఫ్సకు వెళ్లేది. అంతకుముందు సాయంత్రం ఆరు గంటల నుంచే భారీ వర్షం ఆరంభమైంది. దీంతో టాస్‌ కూడా వీలు పడలేదు. అయితే స్థానిక చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి సిస్టం ఉండడంతో మ్యాచ్‌పై ఆశలు పెట్టుకున్నారు. కాసేపు వర్షం ఆగడంతో మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా మైదానం సిబ్బంది రంగంలోకి దిగారు. కాసేపటికే తిరిగి వాన పుంజుకోవడంతో చేసేదేమీ లేకపోయింది. చివరకు రాత్రి 10.23కి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.


ఇదిలావుండగా విరాట్‌ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాక బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడంతో చాలామంది ఫ్యాన్స్‌ తెలుపు జెర్సీలతో కనిపించారు. తమ అభిమాన క్రికెటర్‌ ప్రదర్శనను తిలకిద్దామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. బెంగళూరు తర్వాతి మ్యాచ్‌ను సొంత మైదానంలోనే ఈనెల 23న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. అందులో గెలిస్తే అధికారికంగా ప్లేఆ్‌ఫ్సకు చేరుతుంది.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 12 8 3 1 17 0.482

గుజరాత్‌ 11 8 3 0 16 0.793

పంజాబ్‌ 11 7 3 1 15 0.376

ముంబై 12 7 5 0 14 1.156

ఢిల్లీ 11 6 4 1 13 0.362

కోల్‌కతా 13 5 6 2 12 0.193

లఖ్‌నవూ 11 5 6 0 10 -0.469

హైదరాబాద్‌ 11 3 7 1 7 -1.192

రాజస్థాన్‌ 12 3 9 0 6 -0.718

చెన్నై 12 3 9 0 6 -0.992

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్

Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 02:45 AM