Share News

Dravid Reaction to Suryavanshi's Century: సూర్యవంశీ శతకం.. సంబరం ఆపుకోలేని రాహుల్ ద్రావిడ్ ఒక్కసారిగా..

ABN , Publish Date - Apr 29 , 2025 | 08:39 AM

ఆర్‌ఆర్ చిచ్చర పిడుగు సూర్యవంశీ మెరుపు శతకం చూసి సంబరం అణుచుకోలేకపోయిన కోచ్ రాహుల్ ద్రావిడ్.. చక్రాల కుర్చీలోంచి లేచి మరీ చొప్పట్లు కొడుతూ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Dravid Reaction to Suryavanshi's Century: సూర్యవంశీ శతకం.. సంబరం ఆపుకోలేని రాహుల్ ద్రావిడ్ ఒక్కసారిగా..
Dravid Reaction to Suryavanshi's Century

ఆర్‌ర్ వర్సెస్ జీటీ.. ఈ సీజన్‌లో ఐపీఎల్ అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్ ఇది. కారణం.. ఓ 14 ఏళ్ల బాలుడు. బంతిని టచ్ చేస్తే బౌండరీయే అన్నట్టు జీటీ బౌలర్లపై చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది రెండో అత్యధిక వేగవంతమైన సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 11 సిక్సులు, 7 ఫోర్లతో బౌండీల వరద పారించాడు. మరి ఈ బీహారీ చిచ్చరపిడుగును గుర్తించిందీ.. అతడి టాలెంట్ ప్రదర్శించేందుకు ఓ అకాశం వచ్చేలా చేయడంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. మ్యాచ్‌లో సూర్యవంశీ ప్రతాపం చూసి రాహుల్ ద్రావిడ్ కూడా ఉత్సాహాన్ని అణుచుకోలేకపోయాడు. వీల్ చైర్‌లో కూర్చొన్నా కూడా సూర్యవంశీ సెంచరీ బాదగానే ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు.


రాహుల్‌తో పాటు అప్పటికే స్టేడియంలోని వారందరూ లేచి చప్పట్లు, ఈలల మోత మోగించారు. భారత్‌కు మరో స్టార్ బ్యాటర్ దక్కాడంటూ కామెంట్స్ చేశారు. చివరకు ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్‌లో 101 స్కోరు వద్ద సూర్యవంశీ ఔటయ్యాడు. పెవిలియన్‌కు తిరిగి వెళుతున్న అతడికి అభిమానులు జేజేలు పలికారు. స్టాండింగ్ ఓవెషన్‌తో ప్రశంసలు కురిపించారు. మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడావంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక యశశ్వి జైస్వాల్‌తో కలిసి అతడు నెలకొల్పిన 166 పరుగుల భాగస్వామ్యం ఆర్ఆర్‌కు విజయాన్ని అందించింది. 210 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేరుకునేలా చేసింది. 25 బంతులు, 8 వికెట్లు ఉండగా ఆర్ఆర్ లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో రయాన్ పరాగ్ సిక్సర్‌ బాది ఆర్ ఆర్‌ ఇన్నింగ్స్‌ను దిగ్విజయంగా ముగించాడు.


కాగా, రాహుల్ సంబరపడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన జనాలు అందరకూ సూర్యవంశీ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా ఆర్ఆర్.. సూర్యవంశీని కోటి పెట్టి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో, చిన్న పిల్లాడికి ఇంత ధరా అని అంతా షాకైపోయారు. కొందరు ఈ నిర్ణయంపై పెదవి విరిచారు. తాజా మ్యాచ్‌లో అతడి పరుగుల సునామీకి ఈ విమర్శలన్నీ కొట్టుకుపోయాయి. అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా సునాయాశంగా అతడు ఎదుర్కొన్న తీరు చూసి జనాలు మంత్రముగ్ధులవుతున్నారు. బ్యాటింగ్ మౌలిక సూత్రాలను మరింత పటిష్ఠ పరుచుకుంటే అతడికి తిరుగే ఉండదని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోతున్నారు.. ఛేజింగ్‌ విధానంపై కోహ్లీ కామెంట్

డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 08:46 AM