Share News

సింధుకు నిరాశే

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:37 AM

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నమెంట్‌లోనూ పరాజయమే ఎదురైంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో రౌండ్‌...

సింధుకు నిరాశే

క్వార్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌

జకార్త: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నమెంట్‌లోనూ పరాజయమే ఎదురైంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సింధు 22-20, 10-21, 18-21 తేడాతో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి పొర్నోపవి చౌచువాంగ్‌ చేతిలో ఓడింది. చివరి గేమ్‌లో 18-18తో హోరాహోరీగా కనిపించినా.. వరుసగా మూడు పాయింట్లు కోల్పోవడం తో సింధుకు ఓటమి తప్పలేదు. అలాగే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సతీష్‌ కరుణాకరన్‌-ఆద్య జోడీ, మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసాలకు కూడా రెండో రౌండ్‌లో ఓటమి ఎదురైంది.

గాయం తర్వాత కేవలం రెండో టోర్నీ ఆడుతున్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి అదరగొట్టింది. రెండేళ్ల క్రితం ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన వీరు పోటాపోటీగా సాగిన రెండో రౌండ్‌లో 16-21, 21-18, 22-20తో రాస్మస్‌ జార్‌-ఫ్రెడెరిక్‌ సొగార్డ్‌ (డచ్‌)పై నెగ్గి క్వార్టర్స్‌లో ప్రవేశించారు.

ఇవీ చదవండి:

బెంగళూరు విషాదంపై సచిన్ రియాక్షన్

మాల్యా గాలి తీసిన ఎస్‌బీఐ!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 04:37 AM