Share News

PV Ramana : డబ్బుతో సంబంధం లేదు.. అందరూ ఆడొచ్చు!

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:20 AM

ఆర్ధిక వెసులుబాటు ఉన్నవారే క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని బ్యాడ్మింటన్‌ దిగ్గజం, జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో స్టార్‌ షట్లర్‌ సింధు

PV Ramana : డబ్బుతో సంబంధం లేదు.. అందరూ ఆడొచ్చు!

  • ప్రతిభ ఉంటే చాలు జూ పిల్లలపై నమ్మకముంచాలి

  • గోపీచంద్‌ వ్యాఖ్యలతో విభేదించిన సింధు తండ్రి రమణ

న్యూఢిల్లీ: ఆర్ధిక వెసులుబాటు ఉన్నవారే క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని బ్యాడ్మింటన్‌ దిగ్గజం, జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో స్టార్‌ షట్లర్‌ సింధు తండ్రి పీవీ రమణ పరోక్షంగా విభేదించారు. ఆదాయంతో సంబంధం లేదనీ, అందరూ ఆటలాడొచ్చని రమణ అన్నారు. క్రీడల్లో అత్యున్నతస్థాయికి ఎదిగేందుకు ప్రతిభ ఉంటే చాలన్నారు. దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన తాను కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వాలీబాల్‌ క్రీడలో జాతీయస్థాయిలో రాణించగలిగానని, ఆ క్రీడవల్లే నాకు రైల్వేస్‌లో ఉద్యోగం వచ్చిందని అర్జున అవార్డు గ్రహీత అయిన రమణ వెల్లడించారు. అన్నారు. ‘నా ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి దివ్య చిన్నతనంలో నెట్‌బాల్‌ ఆడేది. కానీ, ఆమె చదువుపై ఎక్కువగా ఆసక్తి కనబర్చడంతో ఆ దిశగా ప్రోత్సహించా. ఆమె వైద్యురాలైంది. చిన్నమ్మాయి సింధు పదో తరగతికి వచ్చేసరికి బ్యాడ్మింటన్‌లో మంచి ఫామ్‌లో ఉంది. దీంతో స్పాన్సర్లు దొరికారు. ఆ తర్వాత సింధు కెరీర్‌ గురించి మీకు తెలిసిందే. కెరీర్‌ ఎదుగుదలలో కొన్ని అవాంతరాలు ఎదురవ్వొచ్చు. కానీ, వాటిని అధిగమించి ముందుకెళ్లాలి. తల్లిదండ్రులు పిల్లలపై నమ్మకముంచాలి. వారి ప్రతిభను గుర్తించి ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలి’ అని 1986లో ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రమణ వివరించారు.

Updated Date - Mar 01 , 2025 | 02:20 AM