వావ్ పంజాబ్
ABN , Publish Date - May 27 , 2025 | 02:32 AM
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో టాప్-2 బెర్త్‌ను ఖరారుచేసుకొంది. జోష్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73), ప్రియాన్షు ఆర్య (35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) అర్ధ శతకాలతో...
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X బెంగళూరు
వేదిక : లఖ్‌నవూ, రా.7.30 నుంచి
క్వాలిఫయర్-1కు అయ్యర్ సేన
అదరగొట్టిన ఆర్య, ఇంగ్లిస్
7 వికెట్లతో ముంబై చిత్తు
జైపూర్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో టాప్-2 బెర్త్‌ను ఖరారుచేసుకొంది. జోష్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73), ప్రియాన్షు ఆర్య (35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) అర్ధ శతకాలతో అదరగొట్టడంతో..సోమవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. సూర్యకుమార్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీ చేయగా.. రికెల్టన్ (27), హార్దిక్ (26), రోహిత్(24) ఫర్వాలేదనిపించారు. అర్ష్‌దీప్, జాన్సెన్, వైశాక్ తలో 2 వికెట్లు తీశారు. ఛేదనలో పంజాబ్ 18.3 ఓవర్లలో 187/3 స్కోరు చేసి గెలిచింది. శ్రేయాస్ (26 నాటౌట్) రాణించాడు. శాంట్నర్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఇంగ్లిస్ నిలిచాడు.
సునాయాసంగా..: ఛేదనలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. ఆర్య, ఇంగ్లిస్ రెండో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాటలో నిలిపారు. ముంబై పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 47/1తో నిలిచింది. వీరిద్దరూ 12వ ఓవర్‌లో అర్ధ శతకాలు పూర్తి చేసుకొన్నారు. అయితే, 15వ ఓవర్‌లో ఆర్యను అవుట్ చేసిన శాంట్నర్.. వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. చివరి 5 ఓవర్లలో పంజాబ్ విజయానికి 39 పరుగులు కావల్సి ఉండగా.. ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగుల భాగస్వామ్యంతో వేగంగా ముగించే ప్రయత్నం చేశారు. 15 బంతుల్లో 14 పరుగులు అవసరపడగా.. ఇంగ్లి్‌సను శాంట్నర్ ఎల్బీ చేశాడు. కానీ, రెండు సిక్స్‌లు బాదిన అయ్యర్.. మరో 9 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు.
ఆదుకొన్న సూర్య: సూర్యకుమార్ అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. ముంబై పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నిచ్చారు. ఆరో ఓవర్‌లో రికెల్టన్‌ను జాన్సెన్ క్యాచవుట్ చేశాడు. 9వ ఓవర్‌లో జేమిసన్ బౌలింగ్‌లో సూర్య 6,4,4 బాదినా.. ఆ తర్వాతి ఓవర్‌లో బ్రార్ బౌలింగ్‌లో వధేరా అద్భుత క్యాచ్‌తో రోహిత్ వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తిలక్ వర్మ (1), విల్ జాక్స్ (17) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో హార్దిక్ పాండ్యా కొంత ఊపుతెచ్చాడు. డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న పాండ్యా.. ఆ తర్వాత స్కోరువేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, 17వ ఓవర్‌లో జాన్సెన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన హార్దిక్.. ఆ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. చివరి మూడు ఓవర్లలో సూర్య, నమన్(20) ఆరో వికెట్‌కు వేగంగా 31 పరుగులు జోడించడంతో.. ముంబై స్కోరు 180 దాటింది. 19వ ఓవర్‌లో వైశాక్ బౌలింగ్‌లో నమన్ రెండు సిక్స్‌లు, సూర్య రెండు బౌండ్రీలు సాధించడంతో మొత్తం 23 రన్స్ లభించాయి. ఆఖరి ఓవర్‌లో నమన్, సూర్యను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు.
స్కోరుబోర్డు
ముంబై: రికెల్టన్ (సి) అయ్యర్ (బి) జాన్సెన్ 27, రోహిత్ (సి) వధేరా (బి) బ్రార్ 24, సూర్య (ఎల్బీ) అర్ష్‌దీప్ 57, తిలక్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 1, జాక్స్ (సి) జాన్సెన్ (బి) వైశాక్ 17, హార్దిక్ (సి) ఇంగ్లిస్ (బి) జాన్సెన్ 26, నమన్ (సి) ఆర్య (బి) అర్ష్‌దీప్ 20, శాంట్నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 184/7; వికెట్ల పతనం: 1-45, 2-81, 3-87, 4-106, 5-150, 6-181, 7-184; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-28-2, జేమిసన్ 4-0-42-0, జాన్సెన్ 4-0-34-2, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-36-1, వైశాక్ 4-0-44-2.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) సూర్య (బి) శాంట్నర్ 62, ప్రభ్‌సిమ్రన్ (సి) అశ్వని కుమార్ (బి) బుమ్రా 13, ఇంగ్లిస్ (ఎల్బీ) శాంట్నర్ 73, శ్రేయాస్ (నాటౌట్) 26, నేహల్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 18.3 ఓవర్లలో 187/3; వికెట్ల పతనం: 1-34, 2-143, 3-171; బౌలింగ్: బౌల్ట్ 3.3-0-36-0, దీపక్ చాహర్ 3-1-28-0, బుమ్రా 4-0-23-1, శాంట్నర్ 4-0-41-2, హార్దిక్ 2-0-29-0, అశ్వని కుమార్ 1-0-16-0, విల్ జాక్స్ 1-0-11-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 14 9 4 1 19 0.372
గుజరాత్ 14 9 5 0 18 0.254
బెంగళూరు 13 8 4 1 17 0.255
ముంబై 14 8 6 0 16 1.142
ఢిల్లీ 14 7 6 1 15 0.011
హైదరాబాద్ 14 6 7 1 13 -0.241
లఖ్‌నవూ 13 6 7 0 12 -0.337
కోల్‌కతా 14 5 7 2 12 -0.305
రాజస్థాన్ 14 4 10 0 8 -0.549
చెన్నై 14 4 10 0 8 -0.647
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి