రెండో రోజు టాపర్ మోహన్
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:32 AM
ప్రొ కబడ్డీ లీగ్ వేలం రెండో రోజు ఆనిల్ మోహన్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం జరిగిన సి, డి కేటగిరీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లో ఆల్‌రౌండర్ మోహన్‌ను యు ముంబా రూ. 78 లక్షలకు...
రూ. 78 లక్షలకు ముంబా వశం
ముగిసిన ప్రొ కబడ్డీ వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ వేలం రెండో రోజు ఆనిల్ మోహన్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం జరిగిన సి, డి కేటగిరీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లో ఆల్‌రౌండర్ మోహన్‌ను యు ముంబా రూ. 78 లక్షలకు కొనుగోలు చేసింది. ఆకాశ్ షిండే (బెంగళూరు), ఉదయ్, నితిన్ రావల్ (జైపూర్) రూ. 50 లక్షల మార్క్ అందుకున్నారు. మొత్తంగా 12వ సీజన్ కోసం రెండు రోజులపాటు జరిగిన వేలంలో నమోదు చేసుకొన్న 529 మంది ఆటగాళ్లలో 121 మంది అమ్ముడయ్యారు. వేలంలో ఇద్దరు ప్లేయర్లే రూ. 2 కోట్ల మార్క్ దాటారు. అత్యధికంగా మహమద్ రెజా రూ. 2.23 కోట్లు పలకగా.. దేవాంక్ దలాల్ రూ. 2.20 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, స్టార్ రైడర్లు పర్‌దీప్ నర్వాల్, సిద్దార్థ్ దేశాయ్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి