Share News

ప్రియాంక్‌ గుడ్‌బై

ABN , Publish Date - May 27 , 2025 | 02:16 AM

గుజరాత్‌ మాజీ కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (35) కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ప్రియాంక్‌.. భారత్‌-ఎ జట్టుకు...

ప్రియాంక్‌ గుడ్‌బై

అహ్మదాబాద్‌: గుజరాత్‌ మాజీ కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (35) కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ప్రియాంక్‌.. భారత్‌-ఎ జట్టుకు సారథ్యం వహించాడు. టీమిండియాకు రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికైనా ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. 17 ఏళ్ల కెరీర్‌లో 127 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 45.18 సగటుతో 8,856 పరుగులు సాధించాడు. 97 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, 59 టీ20లు ఆడాడు. 2016-17 సీజన్‌లో గుజరాత్‌ను రంజీ విజేతగా నిలబెట్టడంలో ప్రియాంక్‌ కీలకపాత్ర పోషించాడు. విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టైటిళ్లు గెలిచిన గుజరాత్‌ జట్టులో సభ్యుడు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:16 AM