Share News

Pranjali Dhumal Wins Gold In Deaflympics: పసిడి ప్రాంజలి

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:09 AM

బధిర ఒలింపిక్స్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ ప్రాంజలి ప్రశాంత్‌ ధూమల్‌ అదరగొట్టింది. ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన...

Pranjali Dhumal Wins Gold In Deaflympics: పసిడి ప్రాంజలి

బధిర ఒలింపిక్స్‌

టోక్యో: బధిర ఒలింపిక్స్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ ప్రాంజలి ప్రశాంత్‌ ధూమల్‌ అదరగొట్టింది. ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ప్రాంజలి స్వర్ణ పతకం దక్కించుకుంది. ఉక్రెయిన్‌, కొరియా రజత, కాంస్య పతకాలు గెలుపొందాయి. ఈ ఒలింపిక్స్‌లో ధూమల్‌కిది మూడో పతకం. ఇంతకుముందు పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణం, 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత కేటగిరీలో రజతం నెగ్గింది.

ఇవి కూడా చదవండి:

కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్

టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!

Updated Date - Nov 25 , 2025 | 03:09 AM