పెగులా జ్వెరెవ్‌కు షాక్
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:25 AM
వింబుల్డన్‌లో రెండో రోజు సీడెడ్ ప్లేయర్లకు చుక్కెదురైంది. పురుషుల, మహిళల విభాగా ల్లో మూడో సీడ్ క్రీడాకారులు అలెగ్జాండర్ జ్వెరెవ్, జెస్సికా పెగు లా, ఐదో సీడ్ క్విన్‌వెన్ జాంగ్‌లకు...
సినర్, స్వియటెక్, క్రెజికొవా ముందుకు
వింబుల్డన్
లండన్: వింబుల్డన్‌లో రెండో రోజు సీడెడ్ ప్లేయర్లకు చుక్కెదురైంది. పురుషుల, మహిళల విభాగా ల్లో మూడో సీడ్ క్రీడాకారులు అలెగ్జాండర్ జ్వెరెవ్, జెస్సికా పెగు లా, ఐదో సీడ్ క్విన్‌వెన్ జాంగ్‌లకు తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. అయితే, టాప్ సీడ్ జానిక్ సినర్, డిఫెండింగ్ చాంప్ బార్బరా క్రెజికొవా, స్వియటెక్ అలవోకగా రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పెగులా (అమెరికా) 2-6, 3-6తో ఎలిజబెత్ కికియారిటో (ఇటలీ) చేతిలో, చైనా ప్లేయర్ క్విన్‌వెన్ జాంగ్ 5-7, 6-4, 1-6తో సినియకొవా (చెక్) చేతిలో, 15వ సీడ్ ముచోవా 5-7, 2-6తో వాంట్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా, 8వ సీడ్ స్వియటెక్ 7-5, 6-1తో కుదెర్మెటోవాపై, 17వ సీడ్ క్రెజికొవా 3-6, 6-2, 6-1 అలెగ్జాండ్రా (ఫిలిప్పీన్స్)పై, ఆండ్రీవ 6-3, 6-3తో మయర్ షరీ్‌ఫపై, కసట్‌కినా (ఆస్ర్టేలియా) 7-5, 6-3 ఎమిలియానా (కొలంబియా)పై, అలెగ్జాండ్రోవా 6-2, 7-5తో ప్రిసిల్లాపై, సంసనోవా 6-3, 6-2తో జాయింట్‌పై, నవారో 6-3, 6-1తో క్విటోవా (చెక్)పై గెలిచారు.
సినర్ అలవోకగా..: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సినర్ 6-4, 6-3, 6-0తో లూకా నార్డీని, ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 6-7(6), 6-7(8), 6-4, 7-6(6), 6-4తో పెరికార్డ్‌ను, మినార్ 6-2, 6-2, 7-6(2)తో రాబర్డో (స్పెయిన్)ను ఓడించారు. అయితే, మూడో సీడ్ జ్వెరెవ్ 6-7(3), 7-6(8), 3-6, 7-6(5), 4-6తో ఆర్థర్ రెండర్‌కెంచ్ (ఫ్రాన్స్) చేతిలో, ముసెట్టి (ఇటలీ) 2-6, 6-4, 5-7, 1-6తో నికోలజ్ బాసిల్లా్‌షవిలి (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి