Asia Cup Discussions: ఐసీసీ మీటింగ్‌కు నఖ్వీ డుమ్మా
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:23 AM
ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మీటింగ్‌లో బీసీసీఐ తమ జట్టుకు...
కరాచీ: ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మీటింగ్‌లో బీసీసీఐ తమ జట్టుకు అందాల్సిన ఆసియాక్‌పపై చర్చించే అవకాశం ఉంది. మంగళవారం దుబాయ్‌లో ఆరంభమైన ఐసీసీ బోర్డు సమావేశం మరో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. పాక్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న నఖ్వీ స్థానిక రాజకీయ వ్యవహారాల కారణంగా రాలేకపోతున్నారని పీసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు చాంపియన్‌గా నిలిచాక నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో నఖ్వీ ఆ ట్రోఫీని తీసుకెళ్లి తన ఆఫీసులో పెట్టి తాళం వేసుకున్న విషయం తెలిసిందే. నఖ్వీ స్థానంలో పీసీబీ సీఓఓ సుమైర్ సయ్యద్ హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!