బాబర్‌కు పాండ్యా బై..బై
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:08 AM
పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మరోసారి ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమయ్యాడు. ఐదు బౌండ్రీలతో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. అయితే, 8వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో..

పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మరోసారి ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమయ్యాడు. ఐదు బౌండ్రీలతో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. అయితే, 8వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతిని బౌండ్రీగా మలిచిన బాబర్.. ఆ తర్వాతి బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో రాహుల్‌కు క్యాచిచ్చాడు. జట్టుకు బ్రేక్ అందించిన పాండ్యా.. బై.. బై అన్నట్టుగా చేతితో చూపిస్తూ సంబరాలు చేసుకోవడం వాతావరణాన్ని వేడెక్కించింది. నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
6
అంతర్జాతీయ క్రికెట్‌లో 4వేల పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన ఆరో భారత క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా. గతంలోనే 4 వేల మార్క్ చేరిన హార్దిక్.. బాబర్, షకీల్‌ను అవుట్ చేసి 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. సచిన్, కపిల్, రవిశాస్త్రి, జడేజా, అశ్విన్‌లు పాండ్యా కంటే ముందున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..