Share News

‘ముక్కోణం’ ఫైనల్లో పాక్‌

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:06 AM

సల్మాన్‌ అఘా (134), రిజ్వాన్‌ (122 నాటౌట్‌) శతకాల మోతతో.. పాకిస్థాన్‌ ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు చేరుకొంది....

‘ముక్కోణం’ ఫైనల్లో పాక్‌

కరాచీ: సల్మాన్‌ అఘా (134), రిజ్వాన్‌ (122 నాటౌట్‌) శతకాల మోతతో.. పాకిస్థాన్‌ ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు చేరుకొంది. తొలుత దక్షిణాఫ్రికా 352/5 స్కోరు చేసింది. క్లాసెన్‌ (87), మాథ్యూ బ్రీట్‌కే (83), బవుమా (82) రాణించారు. లక్ష్యాన్ని పాక్‌ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో పాక్‌కిదే అత్యధిక ఛేదన. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సఫారీలు టోర్నీ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగే ఫైనల్లో పాక్‌-కివీస్‌ తలపడతాయి.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 05:08 AM