వోక్స్, ఒవర్టన్‌కు చోటు
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:29 AM
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 20 నుంచి ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. దీనిలో భాగంగా హె డింగ్లేలో జరిగే తొలి టెస్టు కోసం 14 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టును...
భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 20 నుంచి ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. దీనిలో భాగంగా హె డింగ్లేలో జరిగే తొలి టెస్టు కోసం 14 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. 2022లో చివరి టెస్టు ఆడిన పేసర్ జేమీ ఒవర్టన్‌తోపాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ కు పిలుపందింది. గత నెల 29న వెస్టిండీ్‌సతో జరిగిన తొలి వన్డేలో ఒవర్టన్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉండగా.. మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటాడని జట్టు ఆశిస్తోంది. అలాగే గాయాల నుంచి కోలుకున్న పేసర్లు బ్రైడన్ కార్స్, క్రిస్ వోక్స్‌లతో పాటు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ జేకబ్ బెథెల్ జట్టులోకి వచ్చారు. కాగా కాగా, జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని సమాచారం.
తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, ఒవర్టన్, జాక్ క్రాలే, బెథెల్, జేమీ స్మిత్, టోంగ్, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్.
ఇవి కూడా చదవండి
మరీ ఇంత దారుణమా.. అమ్మాయిలపై మగాళ్ల గుంపు దాడి..
చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..