పాక్ లీగ్‌కు సిందూర్ ఎఫెక్ట్
ABN , Publish Date - May 09 , 2025 | 01:22 AM
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎ్‌సఎల్)పైనా పడింది. ఈ కారణంగా పలు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది...
టోర్నీని వీడే యోచనలో విదేశీ క్రికెటర్లు
కరాచీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎ్‌సఎల్)పైనా పడింది. ఈ కారణంగా పలు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. రావల్పిండి క్రికెట్ కాంప్లెక్స్‌పై భారత్ డ్రోన్లతో దాడి చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే గురువారం రాత్రే ఇక్కడ కరాచీ కింగ్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఇక.. రావల్పిండిలో గురువారం నుంచి శనివారం వరకు జరిగే మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని పీసీబీ నిర్ణయించింది. అయితే ఇదే వేదికపై నిర్వహిస్తారా? లేక తరలిస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. అలాగే భారత సైన్యం ప్రతీకార దాడులతో పీఎ్‌సఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వెంటనే లీగ్‌ను వీడి తమ స్వదేశాలకు వెళ్లే యోచనలో క్రికెటర్లున్నట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..