Becoming ICC President: గంగూలీని ఆపలేరు
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:14 AM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మద్దతుగా నిలిచారు. ఈక్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దాదా ఐసీసీ అధ్యక్షుడు కాకుండా...
భవిష్యత్‌లో అతడు ఐసీసీ అధ్యక్షుడు అవుతాడు
బెంగాల్ సీఎం మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మద్దతుగా నిలిచారు. ఈక్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దాదా ఐసీసీ అధ్యక్షుడు కాకుండా ఎవరూ ఆపలేరని స్పష్టంజేశారు. అసలు సౌరవ్ ఈ పాటికే ఐసీసీ చీఫ్ కావాల్సి ఉందన్నారు. వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యురాలు రిచా ఘోష్‌ను బెంగాల్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ సన్మానించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మమత మాట్లాడుతూ.. ‘అసలు ఈ రోజు ఐసీసీ చీఫ్‌గా ఉండాల్సింది ఎవరు? అతడు గంగూలీ తప్ప మరొకరు కాదు. అతడు ఇప్పుడు అధ్యక్షుడు కాకపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒకరోజు దాదా ఆ పదవి తప్పకుండా చేపడతాడు. అప్పుడు అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి