డ్రెస్సింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ!
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:27 AM
ఆటగాళ్ల కుటుంబ సభ్యుల విషయంలో నిబంధనలను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మరింత కఠినతరం చేసింది. ఐపీఎల్‌లో అమలు చేయనున్న కొత్త రూల్స్‌ను...
భారత్-ఆసీస్ మ్యాచ్‌ను తిలకిస్తున్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క
ఐపీఎల్‌లో కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ఆటగాళ్ల కుటుంబ సభ్యుల విషయంలో నిబంధనలను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మరింత కఠినతరం చేసింది. ఐపీఎల్‌లో అమలు చేయనున్న కొత్త రూల్స్‌ను ఆయా ఫ్రాంచైజీలకు బోర్డు ఈ-మెయిల్ చేసింది. ఈ నిబంధనలను ప్రతిఒక్కరూ తు.చ. తప్పకుండా పాటించాలని ఆదేశించింది. ప్లేయర్ల సంబంధీకులు ఎవరికీ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతి లేదని తెలిపింది. ప్రాక్టీస్ రోజుల్లో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక, క్రికెటర్లు టీమ్ బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే బహుమతి ప్రదాన కార్యక్రమంలో స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించరాదు. అక్రిడిటేషన్ లేనిదే ప్లేయర్లు, మ్యాచ్ అఫీషియల్స్ ఉండే ఏరియా (పీఎంవోఏ)లోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తేలేదని తెలిపింది. ఎవరైనా ఆటగాళ్లు రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే.. తొలుత హెచ్చరిక, పునరావృతం చేస్తే జరిమానా విధించనున్నట్టు బీసీసీఐ పేర్కొంది. కొత్త నిబంధనలను సోదాహరణంగా వివరించడానికి ఈనెల 20న ముంబైలో ఆయా జట్ల కెప్టెన్లతో సమావేశం నిర్వహించనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..