ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు నో చాన్స్!
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:03 AM
బీసీసీఐ సరికొత్త నిబంధనలు ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తున్నా యి. ఇప్పటికే బోర్డు చెప్పినట్టు టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనగా.. తాజాగా తమ కుటుంబసభ్యులు లేకుండానే...

చాంపియన్స్ ట్రోఫీ
న్యూఢిల్లీ: బీసీసీఐ సరికొత్త నిబంధనలు ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తున్నా యి. ఇప్పటికే బోర్డు చెప్పినట్టు టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనగా.. తాజాగా తమ కుటుంబసభ్యులు లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి వెళ్లనున్నారు. ఈనెల 19న ఆరంభం కానున్న సీటీలో పాల్గొనేందుకు జట్టు శనివారం దుబాయ్ పయనం కానుంది. అయితే బోర్డు నూతన ప్రయాణ నియమాల ప్రకారం తొలిసారిగా ఆటగాళ్లు మాత్రమే అక్కడికి వెళ్లబోతున్నారు. విదేశీ పర్యటన 45 రోజులు.. అంతకంటే ఎక్కువగా ఉంటేనే ఆటగాళ్ల కుటుంబసభ్యులకు గరిష్టంగా రెండు వారాలపాటు అనుమతి ఉంటుంది. కానీ సీటీ షెడ్యూల్ మూడు వారాలే కావడంతో ప్లేయర్ల భార్యా పిల్లలు స్వదేశాల్లోనే ఉండాల్సి వస్తోంది. ఒకవేళ ఎవరికైనా మినహాయింపునిచ్చినా.. పూర్తి ఖర్చులు ఆటగాళ్లే భరించాల్సి ఉంటుందని బోర్డు అధికారి పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..