Share News

నిషిక పతక మోత

ABN , Publish Date - May 04 , 2025 | 02:47 AM

జాతీయ సీనియర్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ యువ జిమ్నాస్ట్‌ నిషిక అగర్వాల్‌ ఒకే రోజు మూడు పతకాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది...

నిషిక పతక మోత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ యువ జిమ్నాస్ట్‌ నిషిక అగర్వాల్‌ ఒకే రోజు మూడు పతకాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. శనివారం పుణెలోని శివఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ పోటీల్లో తొలుత నిషిక వాల్టింగ్‌ టేబుల్‌ విభాగంలో (12.883) స్వర్ణం సాధించింది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో నిషిక 11.433 స్కోరుతో రెండో స్వర్ణం సొంతం చేసుకుంది. బ్యాలెన్సింగ్‌ బీమ్‌ విభాగంలో నిషిక 10.967 స్కోరుతో రజతంతో మెరిసింది. శుక్రవారం జరిగిన ఆల్‌రౌండ్‌ విభాగంలో నిషిక స్వర్ణం సాధించడం తెలిసిందే. మొత్తంగా ఈ పోటీల్లో నిషికకు ఇది నాలుగో పతకం.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 02:47 AM