Share News

రన్నరప్‌ నిహాల్‌

ABN , Publish Date - May 16 , 2025 | 05:35 AM

టాప్‌ సీడ్‌ గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌ ఆసియా వ్యక్తిగత ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో రెండో స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో భారత జీఎం నిహాల్‌...

రన్నరప్‌ నిహాల్‌

అల్‌ ఐన్‌ (యూఏఈ): టాప్‌ సీడ్‌ గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌ ఆసియా వ్యక్తిగత ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో రెండో స్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో భారత జీఎం నిహాల్‌ ఇరాన్‌కు చెందిన బర్దియాను చిత్తు చేశాడు. తద్వారా సరీన్‌ వరుసగా నాలుగో విజయం నమోదు చేశాడు. బర్దియా, నిహాల్‌ చెరో ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా..మెరుగైన టై బ్రేకర్‌ స్కోరుతో బర్దియా విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో ప్రదర్శనతో.. న్యూఢిల్లీలో జరిగే వరల్డ్‌ చెస్‌ కప్‌ బెర్త్‌ను నిహాల్‌ ఖరారు చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:35 AM