Womens World Cup: బోణీ కొట్టిన కివీస్
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:50 AM
న్యూజిలాండ్ మహిళలు వన్డే ప్రపంచ కప్‌లో ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో బోణీ చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన కివీస్.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులతో...
నేటి మ్యాచ్
శ్రీలంక X ఇంగ్లండ్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
బంగ్లాదేశ్‌పై గెలుపు
మహిళల వరల్డ్‌కప్
గువాహటి: న్యూజిలాండ్ మహిళలు వన్డే ప్రపంచ కప్‌లో ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో బోణీ చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన కివీస్.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేసింది. బ్రూక్ (69), కెప్టెన్ సోఫీ డివైన్ (63) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 112 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ తేరుకుంది. ఛేదనలో కివీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫహీమా ఖాతూన్ (34) టాప్ స్కోరర్. రబేయా ఖాన్ (25), నహీదా అక్తర్ (17) మోస్తరుగా ఆడారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాల (30)దే కావడం గమనార్హం.
సంక్షిప్తస్కోర్లు: న్యూజిలాండ్: 50 ఓవర్లలో 227/9 (బ్రూక్ హలిడే 69, సోఫీ డివైన్ 63, సుజీ బేట్స్ 29, రబేయా ఖాన్ 3/30); బంగ్లాదేశ్: 39.5 ఓవర్లలో 127 ఆలౌట్ (ఫహీమా ఖాతూన్ 34, రబేయా ఖాన్ 25, నహీదా అక్తర్ 17, జెస్ కెర్ 3/21, లియా తహుహు 3/22, రోస్‌మేరీ 2/20).
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..