New Zealand Seal Test Series: సిరీస్ కివీస్ వశం
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:21 AM
స్టిండీ్‌సతో మూడు టెస్ట్‌ల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0తో సొంతం చేసుకొంది. జాకబ్ డఫీ (5/42) నిప్పులు చెరగడంతో మూడో టెస్ట్‌లో...
మూడో టెస్ట్‌లో విండీస్ ఢమాల్
మౌంట్ మాంగనుయ్: వెస్టిండీ్‌సతో మూడు టెస్ట్‌ల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0తో సొంతం చేసుకొంది. జాకబ్ డఫీ (5/42) నిప్పులు చెరగడంతో మూడో టెస్ట్‌లో కివీస్ 323 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. 462 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు ఆఖరి, ఐదో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 43/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి విండీస్ 138 పరుగులకే కుప్పకూలింది. బ్రాండన్ కింగ్ (67) మినహా మిగతా బ్యాటర్లు కనీస పోరాటాన్ని కూడా ప్రదర్శించలేదు. న్యూజిలాండ్ 575/8 డిక్లేర్, 306/2 డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 420 పరుగులు చేసింది.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్