Share News

మేం క్లోజ్‌ఫ్రెండ్స్‌ కాదు

ABN , Publish Date - May 16 , 2025 | 05:38 AM

పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌తో తన స్నేహంపై భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా వివరణ ఇచ్చాడు. అతడు తనకు ఎప్పుడూ సన్నిహిత మిత్రుడు కాదన్నాడు...

మేం క్లోజ్‌ఫ్రెండ్స్‌ కాదు

అర్షద్‌తో స్నేహంపై నీరజ్‌ చోప్రా

దోహా: పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌తో తన స్నేహంపై భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా వివరణ ఇచ్చాడు. అతడు తనకు ఎప్పుడూ సన్నిహిత మిత్రుడు కాదన్నాడు. బెంగళూరులో ఈనెల 24న తన పేరిట నిర్వహించాల్సిన జావెలిన్‌ త్రో పోటీకి అర్షద్‌ నదీమ్‌ను చోప్రా ఆహ్వానించాడు. అయితే పహల్గావ్‌ దాడి నేపథ్యంలో ఈ పోటీ రద్దయింది. అర్షద్‌ను భారత్‌కు ఆహ్వానించిన నీరజ్‌పై నెటిజన్లు విమర్శల దాడి చేశారు. ‘నదీమ్‌తో నాకేమీ బలమైన బంధం లేదు. సన్నిహిత మిత్రత్వం అసలే లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం దరిమిలా మా ఇద్దరి మధ్య బంధం గతంలో మాది రిగా అసలే ఉండబోదు’ అన్నాడు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:38 AM