హైదరాబాద్‌లో జాతీయ బాక్సింగ్ బరిలో లవ్లీనా నిఖత్
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:01 AM
ఎలీట్ మహిళల జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఎలీట్ మహిళల జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఒలింపియన్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహైన్, ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ అంకుషిత బోరో బరిలోకి దిగుతున్నారు. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన వందమందికి పైగా బాక్సర్లు 10 కేటగిరీల్లో తలపడనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ బాక్సింగ్ సమాఖ్య సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి