MS Dhoni: చెన్నై బ్యాటర్లపై ధోనీ అసంతృప్తి
ABN , Publish Date - Apr 26 , 2025 | 09:41 AM
హైదరాబాద్‌పై మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు విఫలం కావడంపై కెప్టెన్ ధోనీ ఫైరైపోయాడు. బ్యాటర్ల తీరు మరింతగా మెరుగుపడాల్సి ఉందని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తాము ఓటమి చవిచూడటంపై చెన్నై కెప్టెన్ ధోనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెన్నై బ్యాటర్ల తీరు సరిగా లేదంటూ నిర్మొహమాటంగా ఇచ్చి పడేశాడు. మ్యాచ్ తరువాత మీడియాతో మాట్లాడుతూ జట్టు బ్యాటర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘‘వికెట్లను త్వరగా కోల్పోయాము. వాస్తవానికి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో 155 స్కోరు చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. 8 - 10 ఒవర్ల మధ్య పిచ్ స్వభావంలో మార్పు వచ్చింది. అయినా ఇది కూడా అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. మరిన్ని పరుగులు స్కోర్ చేసి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మేము కాస్త మెరుగైన ప్రదర్శనే చేశాము. స్పిన్నర్లు నాణ్యమైన బౌలింగ్ చేశారు. కొంత వరకూ ప్రత్యర్థి బ్యాటర్లను నిగ్రహించారు. అయితే, మేము 15 నుంచి 20 పరుగులు అదనంగా చేసుంటే బాగుండేది’’ అని వ్యాఖ్యానించాడు.
‘‘బ్రెవిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఓవర్స్‌లో కూడా బ్యాటర్స్ ఇలాంటి ప్రదర్శన ఇచ్చి ఉంటే బాగుండేది. స్పిన్నర్స్ వచ్చాక మేము కాస్త తడబడ్డాం. వాస్తవానికి ఆ టైంలో బ్యాట్స్‌మెన్ రంగంలోకి దిగాలి. పట్టు ఉన్న చోట పెద్ద షాట్స్‌కు ప్రయత్నించాలి. కానీ ఇక్కడే మేము కాస్త నిరాశాజనకంగా ఉన్నాము. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్స్‌ను డామినేట్ చేయలేకపోయాము’’ అని అన్నాడు.
‘‘ఇలాంటి టోర్నీల్లో.. జట్టులో చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవచ్చు. కానీ మెజారిటీ క్రీడాకారులు సరిగా ఆడకపోతే సమస్యగా మారుతుంది. ప్రతిసారీ 200 పరుగులు చేయాలని కాదు కానీ పరిస్థితులను సరిగా అంచనా వేసుకుని పరుగులు రాబట్టాలి’’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ లైనప్‌లో మార్పులతో బరిలోకి దిగినా చెన్నై పరాజయాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చింది. బ్రెవిన్ మినహా మిగతా వారందరూ నిరాశ పరచడంతో జట్టుకు శుభారంభం దక్కక చివరకు ఘోర ఓటమని చవి చూసింది.
ఇవి కూడా చదవండి:
మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్తాన్ బోల్తా.. బెంగళూరు విజయం
అర్జున్‌ను యువరాజ్‌కి అప్పగిస్తే.. మరో క్రిస్‌గేల్ అవుతాడు: యువీ తండ్రి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..