Junior Athletics Championship: మోహిత్ మీట్ రికార్డ్
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:47 AM
తెలంగాణకు చెందిన మోహిత్ చౌధరి జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన మీట్‌లోని అండర్-20 పురుషుల 5వేల మీటర్ల...
స్వర్ణం కైవసం
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్
భువనేశ్వర్: తెలంగాణకు చెందిన మోహిత్ చౌధరి జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన మీట్‌లోని అండర్-20 పురుషుల 5వేల మీటర్ల పరుగులో మోహిత్ 14 నిమిషాల 09.71 సెకన్ల రికార్డ్‌తో గమ్యం చేరి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో 14 ని 12.67సె. గత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 11 ఏళ్ల రికార్డును హిమాంశు జాఖర్ బద్దలుగొట్టాడు. హరియాణాకు చెందిన హిమాంశు జావెలిన్ త్రో అండర్-18 విభాగంలో 79.96 మీ. దూరంతో సరికొత్త జాతీయ రికార్డుతో స్వర్ణం నెగ్గాడు. దాంతో 2014లో నీరజ్ 76.50 మీ. దూరంతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..