ఒక్క పూటే భోజనం
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:02 AM
ఫిట్‌నె్‌సను కాపాడుకునేందుకు తాను ఎన్నో ఏళ్లుగా ఒక్కపూటే భోజనం చేస్తున్నానని 34 ఏళ్ల భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి వెల్లడించాడు. ‘2015 నుంచి నేను రోజూ ఒక పూటే భోజనం చేస్తున్నా...

దుబాయ్: ఫిట్‌నె్‌సను కాపాడుకునేందుకు తాను ఎన్నో ఏళ్లుగా ఒక్కపూటే భోజనం చేస్తున్నానని 34 ఏళ్ల భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి వెల్లడించాడు. ‘2015 నుంచి నేను రోజూ ఒక పూటే భోజనం చేస్తున్నా. అది కూడా రాత్రి పూటే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మానేశా. అలా చేయడం చాలా కష్టమే. కానీ ఒకసారి దానికి అలవాటు పడితే ఇబ్బందేమీ ఉండదు’ అని షమి వివరించాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ సందర్భంగా షమి పాదానికి గాయమైంది. దానికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఫలితంగా అతడు 14 నెలలు ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో షమి బరువు 90 కేజీలకు చేరింది. ‘బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నప్పుడు తొమ్మిది కిలోల బరువు తగ్గా. అది చాలా క్లిష్టమైన దశ. స్వీట్లు..తదితర పదార్థాలకు దూరంగా ఉన్నా. నాకిష్టమైన బిర్యానీని మాత్రం అప్పుడప్పుడు తినేవాడిని’ అని షమి వివరించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..