Mithali Raj Recalls Early Days: అప్పట్లో మ్యాచ్‌కు రూ 1000 ఇచ్చారు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:39 AM
ఇప్పుడంటే భారత మహిళల క్రికెట్‌లో ఏదైనా పెద్ద టోర్నమెంట్ గెలిస్తే, జట్టు సభ్యులు నజరానాల రూపంలో రూ. కోట్లు అందుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్టుల రూపంలో రూ. లక్షలు దక్కుతున్నాయి...
న్యూఢిల్లీ: ఇప్పుడంటే భారత మహిళల క్రికెట్‌లో ఏదైనా పెద్ద టోర్నమెంట్ గెలిస్తే, జట్టు సభ్యులు నజరానాల రూపంలో రూ. కోట్లు అందుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్టుల రూపంలో రూ. లక్షలు దక్కుతున్నాయి. ఆర్థికంగా క్రికెటర్లు భారీగానే లాభపడుతున్నారు. కానీ, గతంలో మహిళా క్రికెటర్లకు కనీసం మ్యాచ్ ఫీజులు కూడా లేవని టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ‘ఒకప్పుడు మాకు మ్యాచ్ ఫీజులు, వార్షిక కాంట్రాక్టులు లేవు. 2005 ప్రపంచ కప్‌లో రన్నర్‌పగా నిలిచాం. అప్పుడు మాకు ఒక్కో మ్యాచ్‌కి రూ. 1000 చొప్పున ఇచ్చారు. అది కూడా ఆ టోర్నీ వరకే. అప్పట్లో మహిళల క్రికెట్ నుంచి వచ్చే ఆదాయం తక్కువ. అందుకే మ్యాచ్ ఫీజులు కూడా ఉండేవి కావు. మహిళల క్రికెట్ సంఘం.. బీసీసీఐలో విలీనం అయ్యాక మ్యాచ్ ఫీజులు, వార్షిక కాంట్రాక్టులు మొదలయ్యాయి. మొదట్లో మాకు సిరీ్‌సకు ఇంత అని ఇచ్చేవారు. ఆ తర్వాత ఒక్కో మ్యాచ్‌కు వేతనం చెల్లించారు. ఇప్పుడు పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు వేతనాలు అందిస్తున్నారు’ అని నాటి పరిస్థితులను మిథాలీ వివరించింది. 1973 నుంచి 2006 వరకు భారత్‌లో మహిళా క్రికెట్ కార్యకలాపాలను మహిళల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూసీఏఐ) పర్యవేక్షించింది. 2006 చివర్లో డబ్ల్యూసీఏఐని బీసీసీఐలో విలీనం చేశాక మహిళా క్రికెటర్ల వేతనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!