Manoj Tiwary Statement: రో కోకు పొగబెట్టారు
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:17 AM
భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ నిప్పులు చెరిగాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బలవంతంగా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగేలా చేశారని ఆరోపించాడు..
మనోజ్ తివారీ
న్యూఢిల్లీ: భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ నిప్పులు చెరిగాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బలవంతంగా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగేలా చేశారని ఆరోపించాడు. కృత్రిమమైన సంధి దశను సృష్టించి వారిద్దరినీ ఇబ్బందులకు గురి చేశారన్నాడు. వాస్తవంగా రో-కో రెడ్ బాల్ క్రికెట్‌లో మరికొన్ని రోజులు కొనసాగాలనుకొన్నారని తివారీ చెప్పాడు. కానీ, వారిద్దరూ ఇమడలేని పరిస్థితులు సృష్టించారన్నాడు. ‘నా దృష్టిలో సంధి దశ అనేది భారత్‌కు వర్తించదు. మన దేశవాళీ క్రికెట్‌లో అవకాశాలకోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది ప్రతిభావంతులున్నార’ని తివారీ చెప్పాడు. కోల్‌కతా టెస్ట్ ఓటమి తర్వాత ఆటగాళ్లను కోచ్ గంభీర్ విమర్శించడాన్ని కూడా తివారీ తప్పుబట్టాడు. బ్యాటర్ల టెక్నిక్‌లో లోపముందని గుర్తించినప్పుడు.. కోచ్ ఎందుకు సరిదిద్దలేదని ప్రశ్నించాడు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి