Share News

పారా అథ్లెట్‌ మహేంద్ర ప్రపంచ రికార్డు

ABN , Publish Date - May 27 , 2025 | 02:28 AM

భారత పారా అథ్లెట్‌ మహేంద్ర గుర్జార్‌ పురుషుల జావెలిన్‌ ఎఫ్‌ 42 విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో భాగంగా జావెలిన్‌ను...

పారా అథ్లెట్‌ మహేంద్ర ప్రపంచ రికార్డు

ఢిల్లీ: భారత పారా అథ్లెట్‌ మహేంద్ర గుర్జార్‌ పురుషుల జావెలిన్‌ ఎఫ్‌ 42 విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో భాగంగా జావెలిన్‌ను 61.17 మీటర్ల దూరం విసిరిన 27 ఏళ్ల మహేంద్ర నూతన రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2022లో బ్రెజిల్‌ త్రోయర్‌ రాబెర్టో ఫ్లోరియాని 59.19 మీటర్ల దూరంతో నమోదు చేసిన గత ప్రపంచ రికార్డ్‌ను గుర్జార్‌ తిరగ రాశాడు. ఇక..పురుషుల ఎఫ్‌64 జావెలిన్‌ త్రోలో రెండుసార్లు పారాలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత సుమిత్‌ అంటిల్‌ (72.35 మీటర్లు) స్వర్ణం చేజిక్కించుకున్నాడు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:28 AM