కార్ల్‌సన్ ద వరల్డ్
ABN , Publish Date - May 18 , 2025 | 02:31 AM
‘మాగ్నస్ కార్ల్‌సన్ వర్సెస్ ద వరల్డ్’ మెగా గేమ్ మరికొద్ది రోజుల్లో డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. ఫ్రీస్టయిల్ ఫార్మాట్‌లో జరుగుతున్న సింగిల్ గేమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1,40,000 మందితో కార్ల్‌సన్...
బెర్లిన్: ‘మాగ్నస్ కార్ల్‌సన్ వర్సెస్ ద వరల్డ్’ మెగా గేమ్ మరికొద్ది రోజుల్లో డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. ఫ్రీస్టయిల్ ఫార్మాట్‌లో జరుగుతున్న సింగిల్ గేమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1,40,000 మందితో కార్ల్‌సన్ తలపడుతున్నాడు. గతనెల 4న మొదలైన ఈ మెగా గేమ్‌లో వరల్డ్ నెం.1 కార్ల్‌సన్ సునాయాసంగా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని అంచనా వేశారు. కానీ, వరల్డ్ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే గేమ్ డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. ఈ గేమ్‌లో ప్రత్యర్థులు ఒక్కో ఎత్తు వేసేందుకు 24 గంటల సమయం ఉంటుంది. ఓటింగ్ ద్వారా వరల్డ్ టీమ్ ఎలాంటి ఎత్తు వేయాలో నిర్ణయించుకొంటుంది. 1999లో మైక్రోసాఫ్ట్ నెట్‌వర్క్‌పై నాలుగు నెలలపాటు సాగిన గేమ్‌లో రష్యన్ గ్రాండ్ మాస్టర్ కాస్పొరోవ్ 50వేల మందితో ఆడి గెలిచాడు. కాగా, గతేడాది చెస్.కామ్‌లో 70 వేల మందితో తలపడిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. ఆ గేమ్‌లో గెలిచి కాస్పొరోవ్ రికార్డును తిరగరాశాడు. కాగా.. ఈ రికార్డును అధిగమించాలనే ఉద్దేశంతో కార్ల్‌సన్ మెగా గేమ్‌ను ఆరంభించినా.. అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..