తొలి టైటిల్ వేటలో..
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:23 AM
గుజరాత్ తరహాలో మూడేళ్ల క్రితం మెగా లీగ్‌లోకి అడుగుపెట్టిన జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ). కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 2022, 2023లో ప్లేఆఫ్స్ చేరిన లఖ్‌నవూ...
పంత్ సారథ్యంలో బలంగా లఖ్‌నవూ
గుజరాత్ తరహాలో మూడేళ్ల క్రితం మెగా లీగ్‌లోకి అడుగుపెట్టిన జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ). కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 2022, 2023లో ప్లేఆఫ్స్ చేరిన లఖ్‌నవూ.. గతేడాది ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ఏడో స్థానంతో సరిపెట్టింది. దీంతో రాహుల్‌ను వదిలేసిన యాజమాన్యం.. తాజా సీజన్ కోసం యువరక్తంతోపాటు అనుభవజ్ఞులైన బౌలర్లతో బలమైన జట్టును తయారు చేసింది. ఈసారి టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో వేలంలో డ్యాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అతడికి పగ్గాలు అప్పజెప్పింది. కోచ్ జస్టిన్ లాంగర్ కూడా గొప్ప వ్యూహకర్త కావడంతో లఖ్‌నవూపై ఈసారి భారీ అంచనా లున్నాయి. మ్యాచ్ విన్నర్లు పంత్, నికోలస్ పూరన్, మార్‌క్రమ్, మిల్లర్‌తో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు శుభారంభాన్ని అందిస్తే.. వీరు మరింతగా విరుచుకుపడే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొన్న ఆస్ట్రేలియా పేస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈసారి బ్యాటర్‌గా మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. ఇక, మయాంక్ యాదవ్ తన బుల్లెట్‌లాంటి బంతులతో ఇప్పటికే అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకొన్నాడు. కానీ, అతడి ఫిట్‌నెస్ సమస్య ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. అవేశ్ ఖాన్, షమర్ జోసెఫ్, ఆకాశ్ దీప్‌లతో పేస్ విభాగం మెరుగ్గానే ఉంది. రవి బిష్ణోయ్ చెప్పుకోదగ్గ స్పిన్నర్. కాగా, మిడిలార్డర్‌లో ఎక్కువగా హిట్టర్లు ఉండడంతో.. ఒకవేళ ఇన్నింగ్స్ నిర్మించాల్సి వస్తే క్రీజులో నిలబడి ఆడే ప్లేయర్ లేని లోటు కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో బౌలింగ్ పదును తేలాల్సి ఉంది.
జట్టు
బ్యాటర్లు: డేవిడ్ మిల్లర్, మార్‌క్రమ్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రిజ్‌టెక్;
వికెట్ కీపర్లు: రిషభ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆర్యన్ జుయల్;
ఆల్‌రౌండర్లు: మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌధరి, రాజ్‌వర్ధన్ హంగ్రేకర్, అర్షిన్ కులకర్ణి, ఆయుష్ బదోని;
బౌలర్లు: అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, సిద్దార్థ్, దిగ్వేష్ సింగ్, ఆకాశ్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి