Bangladesh Ireland Test: లిట్టన్ ముష్ఫికర్ శతక మోత
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:09 AM
లిట్టన్ దాస్ (128), ముష్ఫికర్ రహీమ్ (106) శతక మోత మోగించగా, బౌలర్లు కూడా సత్తా చాటడంతో ఐర్లాండ్‌తో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ పూర్తిగా పట్టు బిగించింది...
ఐర్లాండ్‌తో బంగ్లా టెస్టు
మీర్పూర్ : లిట్టన్ దాస్ (128), ముష్ఫికర్ రహీమ్ (106) శతక మోత మోగించగా, బౌలర్లు కూడా సత్తా చాటడంతో ఐర్లాండ్‌తో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ పూర్తిగా పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 292/4తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 476 రన్స్‌కు ఆలౌటైంది. వందో టెస్ట్‌లో ముష్ఫికర్ శతకం సాధించడం విశేషం. స్పిన్నర్ మెక్‌బ్రిన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఐర్లాండ్.. బంగ్లా స్పిన్నర్ల ధాటికి రెండో రోజు చివరకు 98/5తో కష్టాల్లో పడింది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి