Lionel Messi India Visit: భారత ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్ మెస్సీ
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:19 AM
భారత్‌లో ఫుట్‌బాల్‌కు మెరుగైన ఉజ్వల భవిష్యత్ ఉందని సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అన్నాడు. మూడు రోజుల తన పర్యటనలో భారతీయులు ఇచ్చిన ఆతిథ్యానికి ఎంతో...
న్యూఢిల్లీ: భారత్‌లో ఫుట్‌బాల్‌కు మెరుగైన ఉజ్వల భవిష్యత్ ఉందని సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అన్నాడు. మూడు రోజుల తన పర్యటనలో భారతీయులు ఇచ్చిన ఆతిథ్యానికి ఎంతో రుణపడి ఉన్నానని చెప్పాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల వంతారా వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు తన భారత పర్యటనను మెస్సీ ఒకరోజు పొడిగించుకున్నాడు. దాంతో అతడు బుధవారం ఇటలీలోని మియామీకి బయలు దేరాడు. ‘రాబోయే కాలంలో భారత్‌లో ఫుట్‌బాల్ ఇంకా మెరుగవుతుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో నా పర్యటన అద్భుతంగా సాగింది. సచిన్‌తోపాటు యువ ఫుట్‌బాలర్లను కలవడం ఆనందంగా ఉంది. భారతీయుల ఆతిథ్యం నన్ను కట్టిపడేసింది. నా పర్యటన ఆసాంతం ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు కనబరిచారు’ అని మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం