Share News

బట్లర్‌ స్థానంలో కుశాల్‌

ABN , Publish Date - May 16 , 2025 | 05:33 AM

ప్లేఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. విండీస్‌తో సిరీస్‌ ఉండడంతో తను ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నాడు...

బట్లర్‌ స్థానంలో కుశాల్‌

ప్లేఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. విండీస్‌తో సిరీస్‌ ఉండడంతో తను ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నాడు. దీంతో ఆ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌ నుంచే దూరం కానుండగా.. అతడి స్థానంలో కుశాల్‌ మెండిస్‌ను తీసుకున్నారు. అలాగే పంజాబ్‌ పేసర్‌ ఫెర్గూసన్‌ స్థానంలో కైలీ జేమిసన్‌ ఆడనున్నాడు. ఇక లఖ్‌నవూ పేసర్‌ మయాంక్‌ గాయంతో సీజన్‌కు దూరమవడంతో విలియమ్‌ ఓరూర్కీని తీసుకున్నారు. కేకేఆర్‌ నుంచి ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీతో పాటు పావెల్‌ (విండీస్‌), సీఎస్‌కే నుంచి సామ్‌ కర్రాన్‌, ఒవర్టన్‌ కూడా భారత్‌కు రావడం లేదు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:33 AM