Telugu Chess Players: రెండో స్థానంలో హంపి
ABN , Publish Date - Apr 18 , 2025 | 02:36 AM
ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీలో కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది. రష్యన్ జీఎం పోలినా షువలోవాపై విజయం సాధించింది
పుణె: ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్ ఆఖరికి తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి (3 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగిన నాలుగో గేమ్‌లో రష్యన్ గ్రాండ్‌మాస్టర్ పోలినా షువలోవాపై హంపి విజయం సాధించింది. జీఎం వైశాలీ రమేష్ బాబుతో నాలుగో రౌండ్‌ను మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక డ్రా చేసుకుంది. రెండు పాయింట్లతో హారిక నాలుగో స్థానానికి చేరింది. అలీనాపై గెలిచిన ఝు జినేర్ (చైనా, 3.5) అగ్ర స్థానంలో కొనసాగుతోంది.