Chess World Cup 2025: ఫైనల్లో హంపి
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:08 AM
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న మహిళల చెస్ వరల్డ్‌కప్ భారత్‌కు దక్కడం ఖాయమైంది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది....
టైటిల్‌పోరులో దివ్యతో అమీతుమీ
చెస్ వరల్డ్‌కప్ భారత కొప్పులోకే
సెమీ్‌సలో టింగ్జీపై కోనేరు విజయం
బటూమి (జార్జియా): ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న మహిళల చెస్ వరల్డ్‌కప్ భారత్‌కు దక్కడం ఖాయమైంది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన హోరాహోరీగా సాగిన సెమీస్‌లో హంపి 5-3తో చైనా జీఎం లీ టింగ్జీని ఓడించింది. అంతకుముందు జరిగిన రెండు క్లాసిక్ గేమ్‌లు 1-1తో డ్రా అయ్యాయి. ఇక టైబ్రేక్‌లో 15 నిమిషాల తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు టై అయ్యాయి. ఆ తర్వాత జరిగిన 10 నిమిషాల ర్యాపిడ్ గేముల్లోని తొలి పోరులో టింగ్జీ గెలిచింది. మిడిల్ గేమ్‌లో పాన్‌ను చేజార్చుకొన్న కోనేరు.. ఎండ్ గేమ్‌లో ఇబ్బందుల్లో పడింది. దీంతో రెండో గేమ్‌ను డ్రా చేసుకుంటే చాలు...లీ ఫైనల్‌కు చేరుతుంది. అందుకు తగ్గట్టుగానే టింగ్జీ బోర్డుపై పట్టుబిగించింది. గేమ్ దాదాపుగా డ్రాకు చేరువైంది. కానీ, పట్టువదలకుండా పోరాడిన హంపి.. ఆ గేమ్‌ను గెలిచి 3-3తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన మూడో సెట్‌లోని రెండు బ్లిట్జ్ గేముల్లో భారత జీఎం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి.. లీని చిత్తు చేసింది. ఇక రెండో గేమ్‌ను డ్రా చేసుకొంటే హంపి ఫైనల్ చేరినట్టే. కానీ, సాంకేతికంగా మెరుగైన స్థితిలో ఉన్న కోనేరు.. టింగ్జీ ఆటకట్టించింది. దీంతో ఫైనల్ బెర్త్ దక్కించుకున్న హంపి..టీనేజ్ ఐఎం దివ్య దేశ్‌ముఖ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. బుధవారం నాటి పోరులో నెగ్గిన దివ్య ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్ శనివారం నుంచి జరుగుతుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి